23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

దేవాలయాలలో తీర్థానికి ,క్షేత్రానికి తేడా ఏమిటి ,మహా క్షేత్రం అంటే ఏమిటి ?

 దేవాలయాలలో తీర్థానికి ,క్షేత్రానికి తేడా ఏమిటి ,మహా క్షేత్రం అంటే ఏమిటి ?

తీర్థం అంటే తరింపజేసేది.


అకాల మృత్యు హరణం , సర్వ వ్యాధి నివారణం ,


సమస్త దురిత క్షయకరం , శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభమ్


' అంటూ భగవత్ తీర్థం స్వీకరిస్తాము.


పాపాల ప్రవాహం నుంచి జీవుణ్ణి అవతలి గట్టుకు చేర్చేది తీర్థం. సకల కల్మషాలనుంచి ఉత్తరింపజేసేది గంగ. (పావని అన్నా అదే అర్థం పవిత్రం చేసేది.


దురితాలను అంటే పాపాలను క్షయింపజేయగల శక్తి గలది తీర్థం.


భగవత్ సన్నిధిలో ఇచ్చే తీర్థమైనా , నదీ జలమైనా తీర్థమే.


అనుగ్రహ పూర్వకంగా ఆ తీర్థం ఇచ్చి స్వీకరించినపుడు అది మహా తీర్థం.


విష్ణువు పాదంలో జన్మించినదైన గంగకు ఆ సామర్థ్యం ఉంది. సకల జలాలూ గంగే.. ఆ గంగమ్మ అంశే. ఆపోవై సర్వాదేవతాః ..అని శ్రుతి.


మహాత్ముల సన్నిధి గూడా పాపాల నుండి తరింపజేసేదే. కాబట్టి పుణ్యాత్ముల దర్శనమూ అనుగ్రహమూ తీర్థాలే.


పుణ్య పురుషుల స్నాన జప తపాదులు తన సన్నిధిలో సమకూడినందువల్ల ఆయా తీర్థ ఘట్టాలు విశేష శక్తి సంపన్నాలు.


నదీ సామీప్యం కలిగిన దేవాలయాలూ, కొండలపై ఉన్న దేవాలయాలూ విశేష శక్తి కలిగినవి.


క్షేత్రం అంటే పుణ్య స్థలం. పుణ్యాత్ముల నివాస భాగ్యం పొందిన ప్రదేశాలు క్షేత్రాలు.


నదీ సామీప్యం ఉంటే ఇంకా విశేషం.


స్వయం భూ ప్రతిమ గలవి, మహర్షి ప్రతిష్ఠ అయినవి మహా క్షేత్రాలు.


ఆదిత్య హృదయస్తోత్రం | Aditya Hridayastotra

ఆదిత్య హృదయస్తోత్రం | Aditya Hridayastotra


 శ్రీ మద్రామాయణం ఆదిత్య హృదయస్తోత్రం, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్ర తెలుగు అనువాదంతో.


ఆ విధంగా యుద్ధం సమరే చింతాయ స్థితమ్.

రావణ చాగ్రతో దృష్ట్వా జుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥

దైవానుగ్రహంతో రణం.

ఉపమీగబ్రవీద్రమమాగస్త్యో భగవానృషిః ॥ 2 ॥


యుద్ధం చూడడానికి దేవతలను చేరదీసిన అగస్త్య మహర్షి, యుద్ధంలో అలసిపోయి, తన ఎదురుగా రావణుడిని చూసి చింతిస్తున్న రాముడి వద్దకు వెళ్లి ఇలా అన్నాడు.


రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ ।

యేన సర్వనారిన్వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥


పెద్ద చేతులు కల నాయనా! ఓ రామా! రామా! నిత్య రహస్య స్తోత్రం వినండి. దీని ద్వారా మీరు యుద్ధంలో శత్రువులందరినీ ఓడించవచ్చు.


ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ ।

జయవాహం జపేన్నిత్యమక్షైయం పరమ శివమ్ ॥ 4 ॥

సర్వమఙ్గలమఙ్గల్యం సర్వపాపప్రణాశనమ్ ।

ఆయుర్వర్ధనముత్తమం చిన్తాశోకప్రశమనమ్ ౫ ॥


పవిత్రమైన ఆదిత్య హృదయస్తోత్రాన్ని నిరంతరం జపించాలి. ఇది శత్రువులందరినీ నాశనం చేస్తుంది. నాశనం లేని ఫలాలను ఇస్తుంది. చాలా పవిత్రమైనది. ఇది అన్ని శుభప్రదమైన స్తోత్రాలలో అత్యంత శుభప్రదమైనది. ఇది అన్ని పాపాలను తొలగిస్తుంది. ఆందోళన మరియు దుఃఖాన్ని ఉపశమనం చేస్తుంది. జీవితకాలం పెంచడానికి ఉత్తమ సాధనం.


రశ్మిమన్తం సముద్యన్తం దేవాసురనమస్కృతమ్ ।

పూజయస్వ వివస్వన్తం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6


సూర్యునికి అద్భుతమైన కిరణాలు ఉన్నాయి. ఉదయపర్వతం మీద ఉదయించేవాడు (కొందరు వ్యాఖ్యాతలు ప్రజలను వారి వారి పనులకు మళ్ళించేవాడు అని చెబుతారు) దేవతలు మరియు అసురులు కూడా పూజిస్తారు. అతను తన తేజస్సుతో ఇతరుల ప్రకాశాన్ని కప్పివేస్తాడు. కాంతిని ఇచ్చేవాడు. సమస్త లోకములను నియమించువాడు. సూర్యుని ఆరాధన అలాంటిది.


సర్వదేవతామ్ లో హ్యేషా తేజస్వీ రశ్మీభావనః ।

ఏష దేవాసురగణాన్ లోకాన్ పథి గభస్తిభిః ॥ 7


ఆయన సకల దేవతల స్వరూపుడు. అతనికి గొప్ప తేజస్సు ఉంది. కిరణాలతో లోకాలను రక్షిస్తాడు. ఈ సూర్యుడు తన కిరణాలచే దేవతలను, అసురగణాలను మరియు ప్రజలను రక్షిస్తాడు.


ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కన్దః ప్రజాపతిః ।

మహేన్ద్రో ధనదః కాలో యమః సోమో హ్యపం పతిః ॥ 8


ఈ సూర్యుడు బ్రహ్మ, విష్ణు, శివ, స్కంద, నవ ప్రజాపతి, మహేంద్ర, కుబేరుడు, కాలపురుష, యమ, సోమ మరియు వరుణుడు.


పితరో వాసవః సాధ్యా అశ్వినౌ మారుతో మనుః ।

వాయుర్వహ్నిః ప్రజాః ప్రాణ ఋతుకర్తా ప్రభాకరః ॥ 9


పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్వినులు, మరుత్తులు, మనువులు, వాయువులు, అగ్ని, ప్రజలు, ప్రణవాయువులు - ఇవన్నీ సూర్యుడే. ఋతువులను నిర్మించి వెలుగును ఇస్తాడు.


ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।

సువర్ణసదృశో భానుర్హిరణ్యరేత దివాకరః ॥ 10


అదితికుమార్.ప్రపంచ సృష్టికర్త. అతను వారి పనులలో ప్రజలను ప్రేరేపిస్తాడు. ఆకాశంలో విహరించేవాడు. వర్షాలతో ప్రపంచాన్ని పోషించేవాడు. అతనికి కిరణాలు ఉన్నాయి. అతను బంగారు. ప్రకాశించేవాడు.బంగారు నక్షత్రం ఉన్నవాడు. పగ పెంచుకునే వాడు.


హరిదస్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ ।

తిమిరోన్మథనః సమ్భుస్త్వష్టా మార్తాండకోఅంశుమాన్ ॥ 11.


అతనికి ఆకుపచ్చ గుర్రాలు ఉన్నాయి. అతనికి వేయి కిరణాలు ఉన్నాయి. అతనికి సప్త (గోవిందరాజులు) అనే గుర్రం ఉంది. అతనికి ఏడు గుర్రాలు ఉన్నాయి. ప్రకాశించే. చీకటిని నాశనం చేసేవాడు. ఆనందాన్ని ఇచ్చేవాడు.జీవితాన్ని నాశనం చేసేవాడు. జలప్రళయం తర్వాత విశ్వాన్ని పునర్నిర్మించేవాడు. అతనికి కిరణాలు ఉన్నాయి.


హిరణ్యగర్భా శిశిరస్తపనోహస్కరో రవిః ।

అగ్నిగర్భోదితేః పుత్రః శాఖః శిశిరనాశనః ॥ 12.


సూర్యుడు బ్రహ్మ, విష్ణు మరియు రుద్ర స్వరూపం. చలి, తప్పించుకునే. రోజు చేసేవాడు. స్తుతింపబడినవాడు. అగ్ని ముందు ఉన్నవాడు. అదితి కొడుకు. శాంతికర్త. ఉదయాన్ని నాశనం చేసేవాడు.


భగవతే హిరణ్యగర్భాయ నమః అను ద్వాదశాక్షరీ ఆదిత్యహృదయరస్య అని వ్యాఖ్యాతలు వ్రాశారు.


వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసమాపరగః ।

ఘనవృష్టిరపం మిత్రో విన్ధ్యవీతి ప్లవఙ్గమః ॥ 13.


సూర్యుడు ఆకాశానికి అధిపతి. రాహువును భేదం చేసేవాడు. సామవేదాల సారాన్ని పొందినవాడు ఋగ్యజుః. సమృద్ధిగా వర్షాన్ని ఇచ్చేవాడు. ఉదయం స్నేహితుడు. అతను ఆకాశంలో వేగంగా కదులుతున్నాడు.


అతాపి మండలి మృత్యుః పిఙ్గలః సర్వతాపనః ।

కవిర్విశ్వో మహాతేజః రక్తః సర్వభావోద్భవః ॥ 14.


సూర్యుడు సూర్యుడిని ఇస్తాడు. మండల ఎనిమీ కిల్లర్ అతను ఉదయం ఎర్రగా ఉన్నాడు. అతను అందరికీ హాట్ హెడ్. ఒక పండితుడు ప్రపంచ వ్యవహారాల పాలకుడు. గొప్ప తేజస్సు గల వ్యక్తి. అందరికీ నచ్చింది. అన్నిటికి ఆయనే కారణం.


నక్షత్రగ్రహతారణమాధిపో విశ్వభావనః ।

తేజసమపి తేజస్వీ ద్వాదశాత్మన్నమో ⁇ స్తు తే ॥ 15


సూర్యుడు అశ్విన్యాది నక్షత్రాలకు అధిపతి, చంద్రుడు గ్రహాలు మరియు నక్షత్రాలకు అధిపతి. ప్రపంచ స్థాపకుడు. అగ్న్యాది తెలివైనవారిలో అత్యంత తెలివైనవాడు. సూర్యునికి నమస్కారములు. ఓ ద్వాదశ స్వరూపా! నీకు నమస్కారములు. ( ఇంద్రో ధాతా భాగః పూష మిత్రోత్ వరుణోర్యమ అర్చిర్వివస్వాన్ త్వష్టా చ సవితా విష్ణురేవ చ )


నమః పూర్వాయ గిరయే పశ్చిమాయద్రయే నమః ।

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥ 16.


పూర్వ (తూర్పు) పర్వతరూపమునకు నమస్కారము. పశ్చిమపర్వతరూపమునకు నమస్కారము. జ్యోతిర్గణాల స్వామికి నమస్కారాలు. దినాధిపతికి నమస్కారము.


జయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః ।

నమో నమః సహస్రాంసో ఆదిత్యాయ నమో నమః ॥ 17.


పచ్చని గుర్రాలు కలిగిన సూర్యునికి, ఆరాధకులకు విజయాన్ని, శ్రేయస్సు మరియు శ్రేయస్సు (మంగళ) ఇచ్చేవాడు. హలో శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. హలో


నమ ఉగ్రాయ వీరాయ సార్గాయ నమో నమః ।

నమః పద్మ ప్రబోధాయ ప్రచణ్డాయ నమో నమః ॥ 18


ఉగ్రునకు వందనం. వీరుడికి నమస్కారాలు. త్వరితగతిన శుభాకాంక్షలు

తమ వంశ - వంశ మూల పురుషుల పరిచయమును ఋషి-గోత్ర ప్రోక్తము

 


తమ వంశ - వంశ మూల పురుషుల పరిచయమును ఋషి-గోత్ర ప్రోక్తము



భారతీయ సనాతన సాంప్రదాయమున దైవ లేక గురు సముఖమున తమ వంశ - వంశ మూల పురుషుల పరిచయమును ఋషి-గోత్ర ప్రోక్తము గా చేసుకునే విధానము ఉన్నది.


'గోత్రం' అంటే అనేక అర్థాలు ఉన్నాయని శ్రీ సూర్యాయాంధ్ర నిఘంటువు (పేజీ. 734) వివరిస్తోంది. వాటిలో 1. వంశం, 2. గుంపు, సమూహం, 3. పేరు, 4. గొడుగు, 5. బాట అనేవి ఇక్కడ పేర్కొవచ్చు. వీటిలో ఏదైనా ఇక్కడి సందర్భానికి సరిపోతుంది.


'గోత్రం' అనే పదం 'గౌః' అనే సంస్కృతపదం నుంచి ఆవిర్భవించింది. 'గౌః' అంటే గోవులు, ఆవులు అని అర్థం. 'గోత్ర' అనే సంస్కృత పదానికి 1. భూమి, 2 గోవుల సమూహం అని రెండు అర్థాలు ఉన్నాయి. ఒక సంస్కృతపదం తెలుగు పదం అవుతున్నప్పుడు విభక్తి ప్రత్యయాలను చేర్చుతారు. ఆ విధంగా 'గోత్ర' పదం, 'గోత్రము' అవుతుంది.


అయితే గోత్రము అనేది వంశ లేక తెగ మూల పురుషులను తెలుపునదిగా తెలుసుకోగలము. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా, ఆ.మనుష్యుడి తాలూకు బీజము / విత్తనము (లేక వీర్య ధాతువు) పురుషుని నుంచే వస్తుంది. ఆ మూల పురుషులను తెలిపేదే 'గోత్రము'.


'గోత్రం' అనే పదం మన శాస్త్రాలలో మొదటిసారిగా సత్యకామ జాబాలి కథాసందర్భంగా కనిపిస్తుంది. ఈ కథ 'ఛాందోగ్యోపనిషత్‌' నాలుగో అధ్యాయంలో, నాలుగో ఖండంలో ఉంది.


'సత్యకామో హ జాబాలో జబాలాం మాతరమామస్త్రయాంచక్రే బ్రహ్మచర్యం భవతి వివత్సామి కింగోత్రో న్వహమస్మీతి..' అని ఉంది. తెలియవచ్చినంతవరకూ ఇదే తొలి గోత్రప్రసక్తి. ఆ కథ:


సత్యకామ జాబాలి కథ


గౌతమ మహాముని అప్పట్లో సప్తసింధు ప్రాంతంలోని శతద్రూ నది (ఇప్పటి సట్లెజ్‌ నది)తీరంలో తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, బ్రహ్మవిద్యను ఉపదేశిస్తూ ఉండేవాడు. ఒక రోజు ఆయన తన శిష్యులకు విద్యాబోధ చేస్తున్న సమయంలో ఎనిమిదేళ్ల కుర్రాడు వచ్చి, తనకు విద్యాదానం చేయవలసిందిగా కోరతాడు. అప్పటి సమాజనియమాల ప్రకారం ఉపనయనం అయిన వారికే విద్యాభ్యాస అర్హత ఉండేది. ఆ కుర్రాడికి యజ్ఞోపవీతం లేని కారణంగా ఉపనయనం కాలేదన్నది స్పష్టం. దీనికితోడు వేదాధ్యయనం చేయడానికి వచ్చేవాడు, చేతిలో సమిధలతో రావాలి. ఆ కుర్రాడు అదీ చేయలేదు. సంప్రదాయం తెలియని కుర్రాడిని తన శిష్యునిగా చేర్చుకునేముందు గౌతముడు ఆ బాలుణ్ణి 'నీ వంశం ఏమిటి? నీ గోత్రం ఏమిటి?' అని ప్రశ్నించాడు. ఆ బాలునికి అవీ తెలియదు. అయితే, వెళ్ళి తెలుసుకుని రమ్మని చెప్పాడు గౌతముడు. తండ్రి ఎవరో ఎరుగని ఆ కుర్రాడు తన తల్లిని ఆ ప్రశ్నలే అడుగుతాడు. తల్లి వెంటనే 'నేను చాలాకాలంపాటు చాలా ఇళ్లలో దాసిగా పనిచేశాను. ఆ ఇంటివారికీ, ఆ ఇంటికి వచ్చేవారికీ అన్నిరకాల సేవలు అందిస్తూ వారిని సంతృప్తి పరచేదాన్ని. ఆ సమయంలో పుట్టినవాడివి నువ్వు, నీ తండ్రి ఎవరో నాకే తెలియదు! నా పేరు జబాల. నీ పేరు సత్యకామ. కాబట్టి నువ్వు వెళ్లి నీ గురువుతో నీ పేరు సత్యకామ జాబాలి అని చెప్పు' అంటుంది. సత్యకామ జాబాలి వెళ్లి గౌతముడికి అదే చెప్తాడు. సత్యకాముడి నిజాయితీని హర్షిస్తూ, గౌతముడు అతడిని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు. ఇదీ ఆ కథ. ఈ కథలోనే తొలిసారిగా గోత్రం ప్రసక్తి కనిపిస్తుంది. గోత్రం గురించిన అతి ప్రాచీనమైన మొట్టమొదటి ప్రస్తావన ఇదే!!


గోత్రం నిర్వచనం, వివరణం


గోత్రం అనే పదం వేదాలకు వ్యాఖ్యానాలవంటివైన బ్రాహ్మణాలలో ఎక్కడా కానరాదు. అయితే, పాళీ భాషలోని కొన్ని శాసనాలలో మనకు 'గొట్ట' అనే మాట కనిపిస్తోంది. ఉదాహరణకు చెప్పాలంటే, 'భగవా గొతమో గొట్టెన కకుసంధో కశ్శపో గొట్టెన' అన్న ఒక శాసనం ఉంది. ఇందులో గౌతమ, కశ్యప గోత్రాల ప్రసక్తి కనిపిస్తోంది. బౌద్ధమతం సుస్థిరం అయిన కాలంనాటికే గోత్రం అనేది మన సమాజంలో స్థానం సంపాదించుకుంది. జైనులలోకూడా 'గోత్రం' గురించిన ప్రసక్తి ఉంది. తమతమ 'గోత్రకర్మ'లనుబట్టే తదుపరి జన్మలు ఉంటాయని వారు విశ్వసిస్తారని దాస్‌గుప్తా, తమ 'History of Indian Philosophy' Vol. 1, page 191లో వివరించారు.


'మునిభేస్యాపత్యాది వంశే గోత్రాకారశ్చాష్ఠా' అని వాచస్పత్యకారుడు నిర్వచించాడు.


'సంతతిర్గోత్రా జననకులాన్యభిజనాన్వయౌ వంశోన్వవాయః సంతానః' అని నరసింహుడు తన 'నామలింగానుశాసనం'లో పేర్కొన్నాడు.


'అపత్యమ్‌ పౌత్ర ప్రభృతి గోత్రమ్‌' అన్నాడు పాణిని తన సూత్రాలలో (v.1.162).


'స్మృతిసారవాళేధర్మశాస్త్రే యదపత్యంతు సంప్రాప్తం తద్గోత్ర మాభిధీయతే' అంటే, 'ఒక ఋషియొక్క మగసంతాన క్రమావళే గోత్రం' అని అర్థం.


పైన పేర్కొన్న నిర్వచనాలు చూస్తే, 'గోత్రం' అంటే 'సంతానం' అన్న అర్థం స్పష్టమవుతోందని వ్యాఖ్యానకారుల అభిప్రాయం.


ఒకప్పుడు మనందరిదీ వ్యావసాయిక సమాజం. అప్పుడు సమాజంలో అందరికీ తమతమ గోవుల మందలు ఉండేవి. గోవులు అనే మాటను ఆవులు, ఎద్దులకు కలిపి వాడతారనేది తెలిసిందే. ఒకే మందలోని గోవులు గనుక కలసినట్లయితే, ఆ జాతి క్రమంగా క్షీణించిపోయే ప్రమాదం ఉన్న కారణంగా, వేర్వేరు మందలలోని గోవులను కలిపేవారు. దీనివల్ల జన్యుపరంగా కూడా ఆ జాతి వృద్ధి పొందేది. కనుక, ఏ గోవు ఏ మందలోదో తెలుసుకోవటం అవసరంగా ఉండేది. అందుకే, ఒక్కొక్క గోవుల మందకు, ఒక్కొక్క పేరుండేది. సాధారణంగా, ఆ మందకు నాయకత్వం వహించే వారి పేరుమీదుగా ఆ మందను వ్యవహరించటం పరిపాటి. అలా, ఏ గోవును చూసినా, అది ఏ మందకు చెందిందో తెలుసుకోవటం సులభంగా ఉండేది. ఆ పద్ధతిలోని ప్రయోజనాలను గుర్తించి, వాటిని క్రమంగా మనుషులకూ వర్తింపజేయటంతో, మనుషులు సైతం 'ఫలానా గుంపు'లోకి చెందినవారని గుర్తించటం ఆరంభమయింది. ఆ 'ఫలానా గుంపు' క్రమంగా 'గోత్రం' అయి ఉండవచ్చు.


వేర్వేరు మందలకు చెందిన గోవులు కలిసిపోవటం వల్ల తలెత్తే విభేదాలను సామరస్యంగా పరిష్కరించడానికి, అవసరమైన సందర్భాలలో సరైన తీర్పులు చెప్పడానికి కొందరు పెద్దలు ఉండేవారు. వీరిని వారి వారి నైతిక, ఆధ్యాత్మిక విలువల ఆధారంగా 'పర్యవేక్షకులు'గా ఎంచుకునేవారు. ఒక మందకు లేదా 'గోత్రాని'కి ఇలా అధినాయకత్వం వహించేవారిని 'గోత్రపతులు' అనేవారని, ఇటువంటి వారిలో సుప్రసిద్ధులైన వారిలో భరద్వాజుడు, శాండిల్యుడు, కాశ్యపుడు వంటి వారు ఉండేవారనీ, వారే క్రమంగా 'ఋషులు'గా గౌరవం పొందారనీ స్వామి భాస్కరానంద తమ 'Essentials of Hinduism' అనే పుస్తకంలో వివరించారు. (Pub. Sri Ramakrishna Mutt, Mylapore, Chennai, 1998, p.22)


ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధీకులే కాబట్టి, వారంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల వంటి వారే కాబట్టి, సరైన జన్యువులతో వంశం సరిగ్గా వృద్ధి చెందేందుకు 'సగోత్రీకుల'ను వివాహం చేసుకోరాదన్న నిబంధన సమాజంలో ఏర్పడింది. వివాహసంబంధాల కోసం మన గోత్రం కాని ఇతర గోత్రీకులకై అన్వేషించడం వెనుక ఇంత సశాస్త్రీయమైన కారణం ఉందన్నమాట!


జన్యుశాస్త్రం అనేది ఒకటి ఉంటుందనీ, దానివెనుక ఇంత కథ ఉంటుందనీ పశ్చిమ దేశాల శాస్త్రజ్ఞులు గుర్తించడానికి ఎన్నో వేల సంవత్సరాల ముందే మన వాళ్లు గ్రహించిన శాస్త్రీయమైన అంశాలివి!!


పురుషోత్తమ్‌ పండిట్‌ తను రాసిన 'గోత్రప్రవర మంజరి'లో మొత్తం 3 కోట్ల గోత్రాలు ఉన్నాయని అంచనా వేశారు. ఒక్క శుక్ల యజుర్వేద మధ్యందిన మహారాష్ట్ర బ్రాహ్మణులలోనే 188 గోత్రాలు ఉన్నట్లు విశ్వనాథ్‌ త్య్రంబక్‌ సేఠ్‌ తమ 'గోత్రావళి' పుస్తకంలో పేర్కొన్నారు. (ప్రచురణ : యాజ్ఞవల్క్య ఆశ్రమం, పూనా).


అసలు ఈ గోత్రాల గొడవ అంతా మొదట్లో కేవలం బ్రాహ్మణ వంశాలకే పరిమితమై ఉండేదనీ, బ్రాహ్మణులను అనుసరించే ఇతర కులాలూ గోత్రాలను పట్టించుకోవడం ఆరంభమయిందనీ కొందరు అంటారు. బౌద్ధమత సంబంధమైన సాహిత్యంలో ఒక క్షత్రియుడు తమ పురోహితుల గోత్రాన్ని స్వీకరించాలన్న సాక్ష్యాలు అనేకం కానవస్తాయని కరందికర్‌ తమ 'Hindu Exogamies' (page 229)లో పేర్కొన్నారు. అంటే, ముందుగా బ్రాహ్మణ కులంలో మొదలై, తర్వాత క్రమంగా ఇతరులు వారిని అనుసరించటంతో, ఇతర కులాలకూ గోత్రాలు వ్యాపించాయి. అందుకే, ఇప్పటికీ కొన్ని ఇతర కులాలవారిలోనూ బ్రాహ్మణ గోత్రాలు కానవస్తుంటాయి.


'గోత్రం అంటే అభిజనం. ఏఏ మహాత్ములు నీ వంశంలో పుట్టారో ఆ వివరాలే- ఆ మహాత్ముల స్మరణే గోత్రం' అంటారు ద్విసహస్రావధాని, అవధాన సహస్రఫణి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మగారు ('పాలకోడేటి వంశవైభవం' పుస్తకం, ముందుమాటలో, ప్రచురణ: శ్రీ అనుపమ సాహితి, హైదరాబాద్‌- 500 055, 2011). 'గూఙ్‌' శబ్దే ధాతువు. గూయతే శబ్దతే- ఎక్కడ తన పూర్వుల కీర్తనం జరుగుతుందో అది గోత్రం' అంటారు శ్రీ మాడుగులవారు. అదే క్రమంలో వారు 'బ్రాహ్మణుల గోత్రాలు ఋషుల పేర్లతో ఉంటాయి. ఉదా. ఆత్రేయస-భారద్వాజస-కౌశికస- ఇట్లా. ఇతరుల గోత్రాలన్నీ ప్రాయశః ప్రకృతి గోత్రాలు. ఉదా. మద్దిపాల, పైడిపాల, చెట్లపాల, చెరకుపాల, కుంభాల - ఇట్లా. పురుషుడు (భగవంతుడు), - ప్రకృతీ రెండూ కలిస్తేనే పరమేశ్వరుడు పూర్ణుడు. ఎక్కువతక్కువలకిక్కడ తావు లేదు' అంటారు శ్రీ మాడుగులవారు, అదే ముందుమాటలో.


అంందువలన, ఏది ఏమైనా గోత్రము అనేది వంశ లేక తెగ మూల పురుషులను తెలుపునదిగానే తెలుసుకోగలము.


1, జూన్ 2017, గురువారం

రాత్రి వేడి నీళ్లలో ఈ పొడి కలుపుకుని తాగితే 3 నెలల్లో శరీరంలో వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గుతారు..

కావల్సినవి:

* 250 గ్రాముల మెంతులు
* 100 గ్రాముల వాము
* 50 గ్రాముల నల్ల జిలకర

తయారీ విధానం:

 ముందుగా 3 పదార్థాలను రాళ్లు, మట్టి వంటివి లేకుండా శుభ్రం చేసుకోవాలి. వేరు వేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయాలి. మెంతులు, వాము, నల్ల జిలకర కలిపి పొడిగా చేసుకోవాలి.
గాలి పోయే వీలులేని సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఇలా వాడాలి:

* రోజూ రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్లలో 1 స్పూన్ చూర్ణం (పొడి)ని కలిపి తాగాలి.
* ఆ తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు.
* రోజూ ఈ పొడిని తాగితే శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వస్తాయి.
* క్రమం తప్పకుండా 40-50 రోజులు తీసుకున్న తర్వాత గొప్ప ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. 3నెలలు వాడితే మీ ఆరోగ్యానికి ఇక తిరుగు ఉండదు.
* ఈ పొడి వాడిన తర్వాత శరీరంలోని అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
* రక్తం శుభ్రపడుతుంది. శరీరంలో మంచి రక్తం ప్రవహిస్తుంది.

 * బాడీపై ఉన్న ముడతలుపోయి. శరీరంలో యవ్వనత్వం సంతరించుకుంటుంది.
* శరీరం బలంగా, చురుకుగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.

బోలెడు ప్రయోజనాలు:

* కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
* ఎముకలు బలంగా తయారవుతాయి.
* కంటి చూపు మెరుగవుతుంది.
* జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.
* మల బద్దకం శాశ్వతంగా దూరమవుతుంది. మోషన్ సాఫీగా అవుతుంది.
* రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది.
* దీర్ఘ కాలిక దగ్గు పోతుంది.
* గుండె పనితీరు మెరుగవుతుంది.
* మెదడు చురుగ్గా మారుతుంది. వినికిడి పెరుగుతుంది.
* రోజువారీ పనుల్లో చెలాకీగా పాల్గొంటారు.
* గతంలో తీసుకున్న ఇంగ్లిష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ను ఇది క్లియర్ చేస్తుంది.
* పళ్లు చిగుళ్లు బలంగా, ఆరోగ్యంగా మారతాయి.
* షుగర్ నియంత్రణలోకి వస్తుంది.
* గ్యాప్ లేకుండా 3 నెలలు ఈ చూర్ణం వాడిన వారు అద్భుత ఫలితాల కోసం మళ్లీ వాడాలనుకుంటే 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ 3నెలలు వాడుకోవచ్చు.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.

24, ఏప్రిల్ 2017, సోమవారం

బంపర్ ఆఫర్ ; IPHONE7

బంపర్ ఆఫర్; ఐఫోన్7 ఎంతో తెలుసా?

ఆపిల్ డేస్ ఆఫర్ లో భాగంగా ఐఫోన్ల‌పై భారీగా డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఐఫోన్ 7 (256 జీబీ) కేవలం రూ. 39, 999లకే అంటే 20 వేల త‌గ్గింపు

రూ.19 వేల వ‌ర‌కు ఎక్స్‌చేంజ్ ఆఫ‌ర్ కింద అద‌న‌పు డిస్కౌంట్

యాక్సిస్ బ్యాంక్ బ‌జ్ క్రెడిట్ కార్డ్స్‌పై అద‌నంగా మ‌రో 5 శాతం త‌గ్గింపు

ఐఫోన్ 6.. 16 జీబీ వేరియంట్ పై ఏకంగా రూ.26010 డిస్కౌంట్‌ ఇవ్వడంతో కేవ‌లం రూ.25990లకే ల‌భించ‌నుంది(ఎక్స్‌చేంజ్‌, యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ డిస్కౌంట్లు వీటికి కూడా వ‌ర్తిస్తాయి)

ఐఫోన్ 6ఎస్‌, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 5ఎస్‌ల‌పైనా డిస్కౌంట్లు

ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రొ రూ.54990లకే ఫ్లిప్‌కార్ట్‌లో ల‌భిస్తుంది

సెలెక్టెడ్ బ్యాంక్ డెబిట్‌, క్రెడిట్ కార్డ్స్‌పై రూ.1500 వ‌ర‌కు డిస్కౌంట్ లభించనుంది

ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ల‌పై 35 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ఉంది

ఈ ఆఫర్ ఏప్రిల్ 24.. 25.. 26… ఈ మూడు రోజులపాటు  ఐఫోన్‌, మ్యాక్‌బుక్ ప్రొ, ఆపిల్ వాచ్‌ వంటి ఆపిల్ డివైస్‌ల‌పై భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇంకేముంది వెంటనే నచ్చినవి కొనుక్కోండి. ఈ మూడు రోజుల ఆఫర్ గురించి అందరికి తెలియజేయండి…