Video Discription |
#ugadi #ugadifestival #specialsongs #aswinimedia
యుగయుగాల ఉగాది స్పెషల్ సాంగ్ - 2023| Ugadi Special Song - 2023 | Aswini Media
Ugadi Special Song
------------------------------
Producers : Vivekvasu Nagalla, M G Raghavendra
Business Head : A Madhukiran
Song composed : S Siva Dinavahi
Singer : Sai Veda Vaagdevi
Lyrics : Likith
Editing & VFX : S Srinivas
Keyboard programming : Sai Kumar
Rhythms programming : Pavan Sumar
Chorus : Nigama, Snikitha, Sragvi
Studio : chinmai studio’s @hyderabad
Sound engineer : chinna
Mixed and mastered : Dayal Jeebu
ఉగాది పాట
బ్రహ్మ దేవుని సృష్టి ముహూర్తం ఉగాది...
యుగయుగాల తెలుగు సంత్సరాది ఉగాది...
ప్రకృతి మాత పులకరించే పచ్చని ఉగాది ...
పల్లవి: పచ్చ పచ్చ చేలల్లో, పుల్ల పుల్ల మామిళ్ళు....
వేపచెట్టు చిగురుల్లో, లేత లేత కుసుమాలు....
చెట్టు చివర కొమ్మల్లో, కోయిలమ్మ రాగాలు....
ఉగాధీ, ఇది ఉగాది.... యుగ యుగాల తెలుగు సంవత్సరాది... !! పచ్చ పచ్చ !!
చరణం 1 : తీపి, పులుపుల సమ్మెళనం, ఉగాదికి అదే సంబరం.
చేదు వగరుల సమిళితం, జీవితానికి ఇది పరమార్ధం..
కారం ఇచ్చే మమకారం, ఉప్పందించే విశ్వాసం..
ఇదేకదా తెలియాల్సిన సత్యం, ఇదేకదా ఉగాది మహత్యం.. !! పచ్చ పచ్చ !!
చరణం : ఆరగించిన పచ్చడులు, ఆలకించిన పంచాంగ శ్రవణాలు..
దర్శించిన దేవతలు, దీవెనలిచ్చేను కర్పూర హారతులు..
చైత్రంతెచ్చిన వసంతాలు, ప్రతి ఇంటా ఉగాది కాంతులు..
యుగయుగాల ఉగాది, తరతరాలకు అయ్యేను సారధి...
!! పచ్చ పచ్చ !!
Ugadi or Yugadi, also known as Samvatsarādi (lit. 'Beginning of the Year'), is New Year's Day according to the Hindu calendar and is celebrated in the states of Karnataka, Andhra Pradesh, Telangana and Goa in India. It is festively observed in these regions on the first day of the Hindu lunisolar calendar month of Chaitra. This typically falls in April month of the Gregorian calendar. It also falls during the Tamil month of either Panguni or Chithrai, sometimes on the day after Amavasya with 27th Nakshatra Revati. Ugadi day is pivoted on the first New Moon after March Equinox.
The day is observed by drawing colourful patterns on the floor called Muggulu, mango leaf decorations on doors called torana, buying and giving gifts such as new clothes, giving charity to the poor, oil massages followed by special baths, preparing and sharing a special food called pachadi, and visiting Hindu temples. The pachadi is a notable festive food that combines all flavors – sweet, sour, salty, bitter, astringent and piquant. In Telugu and Kannada Hindu traditions, it is a symbolic reminder that one must expect all flavors of experiences in the coming new year and make the most of them. Followers of the Souramana calendar system observe Ugadi in Karnataka, when the sun transits into the Aries Constellation, which is also the festival of Baisakhi, and is locally known as Souramana Ugadi or Mesha Sankranti.
గోదావరి జిల్లాలలో చేసే ఉగాది పచ్చడి చాల రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్డాలు: వేప పువ్వు-1కప్పు, బెల్లంపొడి-1కప్పు, కొబ్బరికోరు-1కప్పు, బాగా మగ్గిన అరటి పండ్లు-6, మామిడికాయ-1, కొత్తకారం-చిటెకెడు, ఉప్పు-అరస్పూను, శనగట్నాల పప్పు పొడి-1కప్పు, చింతపండు-నిమ్మకాయ, కొద్దిగా చెరుకుముక్కలు, వేయించిన వేరుశనగపప్పు- అరకప్పు.చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి. వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి.
యుగయుగాల ఉగాది
ఋతువులు కాలధర్మంతో సంబంధించినవి కనుక సాయనాలు.ఎప్పటికప్పుడు కదిలిపోతుంటాయి విషువత్తునిబట్టి. విషువత్ మారినా మనం ఇప్పటికీ చైత్ర వైశాఖమాసాలు వసంతఋతువు అంటున్నాము. రామాయణకాలంలో వైశాఖజ్యేష్ఠాలు వసంతం.భారతకాలంలో విషువత్ చలించడంవల్ల చైత్ర వైశాఖమాసాల్లో పడ్డది.అంటే భారతకాలంలో విషువత్ మృగశిరంలో వచ్చి, వరాహమిహిరుని కాలానికి అశ్విన్యాదికి చలించింది.కనుకనే విష్ణుపురాణం మేషాదౌచ మృగాదౌచ మైత్రేయ విషవః స్థితాః అని చెప్పింది. తర్వాత మారుతూ వచ్చిందనే కదా!! నేడు మాఘమాసంతోనే వసంతఋతువు ప్రారంభమవుతుంది.చైత్ర వైశాఖ మాసాలలో ఎండలు.నేడు ధర్మసింధువుకారుడు ఉగాది కాలానికి వేపకొళ్ళు తినడం చేయమన్నాడు. కాని మన ఉగాది కాలానికి వేపచిగుళ్ళు ముదిరి పూతకూడ రాలిపోయి, పిందెలు పుడుతున్నాయి. వరాహమిహిరుడు క్రీస్తుశకం 5వ శతాబ్దివాడు.తనకు కొన్ని శతాబ్దాలముందే విషువత్ మృగశిరనుండి అశ్వినీనక్షత్రం ప్రథమపాదానికి రావడం గుర్తించాడు. వేదాంగ జ్యోతిష్య కాలంకంటే ప్రాచీనమైన ప్రాహ్మణాలకాలంలో వసంత విషుత్కాలం కృత్తికానక్షత్రంలో సంభవించిందని పరిశీలించాడు. తనకాలంలో వసంత విషువత్కాలం అశ్విన్యాదిలో సంభవించడం చేత ఆనాటినుంచి ఉత్తరాయణం దేవమానదినం ప్రారంభం కావడం ప్రాచీన సాంప్రదాయం కనుక అదే వసంత కాల ప్రారంభంగాను, ఆనాడే సంవత్సర ప్రారంభంగాను నిర్ణయించి మాస ఋతు సామరస్యం చేసాడు. వసంత విషుత్కాలం చైత్రమాస ప్రారంభంగా పరిగణితమైందన్నమాట, కాని మనం ధర్మసింధు కారుడన్నట్టు శుక్ల ప్రతిపదాదినుంచి అమావాస్యతో ముగిసే కాలాన్ని నెలగా పరిగణిస్తున్నాము.నాటినుంచి నేటివరకు చైత్రమాసంలోనే ఉగాది పండుగ అనే ఆచారం ఏర్పడింది. |